Wednesday, June 8, 2016

kova Rako vAditho rasika

Song: kova Rako
Raga:

kova Rako vAditho rasika
sri venu gopala bhavatha

bhAvaja janaka shuBHanga jIva nayaka
gopa vadhu natha

yamuna theera puliney sumadhumase kaumudhyam
premaravanugamana gobhyo te unmeelitha nayana
askhalitha kamam gaavo nilihire tavakaram
sumanasovavarshuvu divya sumanim
tumburu narada mukhyanu sanjaguhu
kamalanayana rasa roopa devakavi vinutha

కోవా రాకో వాదితో రసిక
శ్రీ వేణు గోపాల భవత

భావజ జనక శుభాంగ
జీవ నాయక గోప వధూనాథ

యమునా తీర పులినే సుమధుమాసే కౌముద్యాం
ప్రేమ రవానుగమనా గోప్యో తే ఉన్మీలిత నయనా
అన్ఖలిత కామం గావో నిలిహిరే తవకరం
సుమనోసవవర్షువు దివ్య సుమాని
తుంబురు నారద ముఖ్యానుసంజగుః
కమలనయన రసరూప దేవ కవి వినుత |కోవా రాకో|

Re arranging the words:

Rako vAditho rasika
sri venu  gopala kova bhavatha?

bhAvaja janaka shuBHanga jIva nayaka
gopa vadhu natha (kova bhavatha?)

పౌర్ణమి రేయి వేణువునూదే రసికుడగు
శ్రీ వేణు గోపాల స్వామి ఏందున్నాడో?

మన్మథుని తండ్రి, చక్కని అంగ సౌష్ఠవం కలిగిన
జీవ నాయకుడు ఐన గోపికావల్లభుడు (ఏందున్నాడో)

యమునా తీర పులినే: యమునా నది ఒడ్డున
సుమధుమాసే: అందమైన మధు మాసమందు
కౌముద్యాం: విరిసిన కుముదములతో(Wayer lilies)
ప్రేమ రవానుగమనా గోప్యో: వేణు రవమును
అనుగమించి వచ్చిన గోపికలయందు
గావో: గోవులయందు
ఉన్మీలిత నయనా: అరమోడ్పు దృష్టి నిలిపియున్న
అన్ఖలిత కామం: అన్ఖలిత బ్రహ్మచారి అయిన
తవకరం: నీ చేయి పట్టుకుని
నిలిహిరే: తరంగములవలె కదలుచూ (గోపికలు తన్మయత్వంతో ఊగుతూ ఆడుచుండ)
సుమనోస: దేవతలు

దివ్య సుమాని వవర్షువు: దివ్యమైన పుష్పవృష్టి కురిపించుచుండ
దేవ కవి ,తుంబురు నారద ముఖ్యానుసంజగుః
బృహస్పతి మరియు తుంబుర నారదాదులచే
వినుత- సన్నుతింపబడు
కమలనయన: పద్మము వంటి కనులు
రసరూప -కమ్మని రూపము కలిగిన
శ్రీ వేణు గోపాల స్వామి ఏందున్నాడో? |కోవా రాకో|